188 మిలియన్ వ్యూస్ రాబట్టాడు కానీ రామ్ చరణ్ రికార్డు మాత్రం టచ్ చేయలేకపోయాడు

కన్నడ సినిమా స్థాయిని పెంచిన మూవీ కెజిఎఫ్. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ వసూళ్ల వర్షం కురిపించింది. ఇండియా వైడ్ పేరు తెచ్చుకున్న ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని కన్నడతో పాటు అన్ని ఇండస్ట్రీల అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ లో రిలీజ్ కానున్న కెజిఎఫ్‌ -2 మూవీ టీజర్ ని జనవరి 7న రిలీజ్ చేసారు. అన్ని భాషలకి కలిపి ఒకే టీజర్ రిలీజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా 188 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. మరే టీజర్ కూడా ఈ రికార్డు బ్రేక్ చేస్తుందనే నమ్మకం అయితే ఎవరికీ లేదు. యూట్యూబ్ లో అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన కెజిఎఫ్‌ -2 టీజర్, 1 మిలియన్ కామెంట్స్ తెచ్చుకోని మరో అరుదైన ఘనత సాధించింది.

వ్యూస్ అండ్ కామెంట్స్ లో రికార్డు సృష్టించిన కెజిఎఫ్‌ -2 టీజర్, రామ్ చరణ్ రికార్డుని మాత్రం టచ్ చేయలేకపోయింది. మే 27 2020న రిలీజ్ అయినా జక్కన మహాకావ్యం ఆర్ ఆర్ ఆర్ టీజర్… భీం ఫర్ రామరాజు 44 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఎన్టీఆర్ వాయిస్, చరణ్ అప్పీరెన్స్ కి తెలుగు సినీ అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో లైక్స్ అండ్ కామెంట్ల వర్షం కురిసింది. 1 మిలియన్ లైక్స్ తెచ్చుకున్న ఈ రామరాజు టీజర్, 1.5 మిలియన్ కామెంట్స్ తెచ్చుకోని టాప్ ప్లేస్ లో నిలిచింది. అంటే 188 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న కెజిఎఫ్‌ -2 టీజర్ కన్నా 44 మిలియన్ వ్యూస్ మాత్రమే రాబట్టిన రామరాజు టీజర్ కే ఎక్కువ కామెంట్స్ వచ్చాయనమాట. కెజిఎఫ్‌ -2 టీజర్ జోష్ ఎలాగూ తగ్గింది కాబట్టి రామ్ చరణ్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం లేదు.