RRR, మాస్టర్‌ను దాటేసిన KGF-2

కేజీఎఫ్1 సూపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ 2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకే ముందే ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇటీవలే కేజీఎఫ్ 2 టీజర్ విడుదలవ్వగా.. ఈ టీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది. RRR, మాస్టర్ టీజర్లను దాటేసి కేజీఎఫ్ 2 టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 టీజర్ విడుదలైన 10 గంటల వ్యవధిలోనే 20 లక్షల వ్యూస్‌ను సంపాదించింది.

KGF 2 TEASER RECORED

తొలి 10 గంటల వ్యవధిలో RRR టీజర్ 9.41 లక్షల వ్యూస్ సంపాదించగా.. మాస్టర్ 18.5 లక్షల వ్యూస్ సాధించింది. ఇక సర్కార్ 11.8 లక్షలు, మెర్సెల్ 7.82 లక్షలు సాధించింది. RRR, మాస్టర్‌ను దాటేసి తొలి 10 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా కేజీఎఫ్ 2 నిలిచింది.