కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ స్టార్ హీరో యశ్-డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జులై 16న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. ఇందులో చేతిలో గన్ను పట్టుకుని ఉన్న యశ్ లుక్ గూస్బమ్ తెప్పిస్తోంది. కేజీఎఫ్ పార్ట్ 1 అన్ని భాషల్లో హిట్ కావడంతో.. కేజీఎఫ్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన కేజీఎఫ్ 2 పోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించాయి. ఇటీవల విడుదలైన టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేసి రికార్డులు తిరగరాసింది.

KGF 2 ON JULY 16

అత్యధిక వ్యూస్‌తో పాటు అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సంపాదించిన టీజర్‌గా ప్రపంచ రికార్డులు నెలకొల్పింది కేజీఎఫ్ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కేజీఎఫ్ అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు సాధించడంతో.. కేజీఎఫ్ 2 ఒక ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.