కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ఇదే?

యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న కేజీఎఫ్ 2 టీజర్ ఇటీవల విడుదలై యూట్యూబ్‌ను షేక్ చేసింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. దీంతో కేజీఎఫ్ 2 రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా… రిలీజ్ తేదీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

kgf2 release date fix

మే 30న అన్ని భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. కేజీఎఫ్ 1ను కూడా తెలుగులో ఆయనే విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ విలన్‌గా నటించగా.. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలలో నటించారు.