KGF-2: కేజీఎఫ్-2 నైజాం రైట్స్ ఫిక్స్.. పోటీ ప‌డుతున్న టాలీవుడ్ బ‌డా నిర్మాత‌..

KGF-2: క‌న్న‌డ స్టార్ య‌శ్, ప్ర‌శాంత్‌నీల్ కాంబినేష‌న్‌లో కేజీఎఫ్-2 చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కేజీఎఫ్ సీక్వెల్‌గా వ‌స్తుండ‌గా.. ఈ సినిమా ఎంతో సంచ‌ల‌న విజ‌యం అందుకుంది. విడుద‌లైన అన్ని భాష‌ల్లో కేజీఎఫ్ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. కాగా ఈ సినిమాకు మించి యాక్ష‌న్ సీన్స్‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం. దీంతో ఈ సెకండ్ పార్ట్ కోసం ప్ర‌పంచం మొత్తం వెయిట్ చేస్తోంది.

kgf-2 updates

కాగా KGF-2 ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ డ్రామాగా కేజీఎఫ్ చిత్రానికి నైజాం రైట్స్ హ‌క్కులు పొంద‌డానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా రైట్స్‌ను ద‌క్కించుకోవ‌డం కోసం తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూట‌ర్స్ పోటీప‌డుతున్నార‌ట‌. అన్ని ఏరియాల‌కంటే నైజాం ఏరియా క‌లెక్ష‌న్స్ భారీగా ఉంటాయి. దీంతో KGF-2 కేజీఎఫ్-2 నైజాం రైట్స్‌కు మేక‌ర్స్ భారీ రేట్ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం. థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు 75కోట్ల రూపాయ‌లుగా నిర్మాత‌లు ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.ఇక ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకోవ‌డం కోసం టాలీవుడ్‌లో బ‌డా నిర్మాత దిల్ రాజుతో పాటు ప‌లువురు పోటీప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలాఉంచితే ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిల్మ్ బ్యాన‌ర్‌పై విజ‌య్‌కిరంగ‌దూర్ నిర్మిస్తుండ‌గా.. KGF-2ఇందులో బాలీవుడ్ ప్ర‌ముఖులు సంజ‌య్‌ద‌త్‌, ర‌వీనాటాండ‌న్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.