సెట్లో డైరెక్టర్‌ను చితకబాడిన స్టార్ హీరోయిన్

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. తెలుగుతో పాటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్.. తెలుగులో నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అబుదాబీలో జరుగుతోంది. ఇక్కడ నితిన్, కీర్తి సురేష్‌పై పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ సందడి సందడిగా జరుగుతోంది. సెట్లో జరిగిన పలు ఫన్నీ మూమెంట్స్‌ను నితిన్, కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

keerty suresh

ఇటీవల సెట్లో కీర్తి సురేష్ నిద్రపోతున్న ఫొటోలను నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కీర్తి నిద్రపోతుండగా.. వెనుక నుంచి డైరెక్టర్ వెంకీతో కలిసి నితిన్ సెల్ఫీ తీశాడు. ఎండలో తమకు చెమటలు పడుతుంటే.. కీర్తి మాత్రం రిలాక్స్ అవుతుందంటూ నితిన్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన కీర్తి సురేష్.. దీని వల్ల సెట్లో ఇంకెప్పుడు నిద్ర పోకూడదనే గుణపాఠం నేర్చుకున్నానని, త్వరలోనే నితిన్, డైరెక్టర్‌పై పగ తీర్చుకుంటానని కామెంట్ చేసింది. దానికి తగ్గట్లే తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరిపై కీర్తి పగ తీర్చుకుంది.

సెట్రో ఒక గొడుగు దొరకడంతో సరదాగా డైరెక్టర్ వెం అట్లూరిని కీర్తి పరిగెత్తించి కొట్టింది. గొడుగుతో చితకబాడింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కీర్తి సురేష్.. ఇదంతా సరదాగా చేశానని, డైరెక్టర్‌పై పగ తీర్చుకున్నానని చెప్పింది. ఇక నితిన్ ఒక్కడే మిగిలి ఉన్నాడని తెలిపింది. దీనిని చూస్తుంటే ఏదో ఒకరోజు నితిన్‌పై కూడా పగ తీర్చుకోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.