కీర్తి సురేశ్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ పెంగ్విన్ టీజ‌ర్ విడుద‌ల‌

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటీమణులైన సమంత అక్కినేని, తాప్సీ పన్ను, త్రిష మరియు మంజు వారియర్‌లు సంయుక్తంగా కీర్తి సురేష్ నటించగా అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పెంగ్విన్ చిత్ర టీజర్‌ను నేడు ఆవిష్కరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తొలిసారిగా జూన్ 19వ తేదీన ప్రదర్శించడానికి షెడ్యూల్ చేయబడిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను ఓ తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి చేసే శారీరక, భావోద్వేగ ప్రయాణ నేపథ్యంలో చిత్రించారు. కార్తీక్ సుబ్బరాజ్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ మరియు ప్యాషన్ స్టూడియోస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల నడుమ సంచలనం సృష్టించింది. తన పిల్లల కోసం ఆరాటపడే ఓ తల్లిగా కీర్తి సురేష్ చేస్తున్న భావోద్వేగ ప్రయాణంలో భాగంకండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 19 జూన్ 2020 వ తేదీన తెలుగు, తమిళంతో పాటుగా మళయాళంలో డబ్బింగ్ ప్రసారం చేయబడుతుంది.