కీర్తి సురేష్ పెంగ్విన్ ట్రైలర్ ని విడుదల చేసిన న్యాచురల్ స్టార్ నాని

ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు డైరెక్ట్ టూ రిలీజ్ స్లాట్ లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమాను జూన్ 19న రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్స్ అంతా ఈ సినిమాను ఎక్సక్లూసివ్ గా ఈ ప్లాట్ ఫామ్ పై వీక్షించవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవలే పెంగ్విన్ టీజర్ ని అమెజాన్ వారు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి అనూహ్యమైన స్పందన రావడం తో తాజాగా అమెజాన్ వారు ట్రైలర్ ని సిద్ధం చేశారు.  ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేయడం విశేషం. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దర్సక నిర్మాత కార్తీక్ సుబ్బరాకు ఈ సినిమాను నిర్మించారు. ఇక దర్శకుడు కార్తీక్ ఈశ్వర్ ఈ సినిమాను ఆద్యంతం థ్రిల్లర్ ఎపిసోడ్స్ తో రూపొందించారు.