‘కీర్తి సురేష్’ మరో ‘బోల్డ్ స్టెప్’ తీసుకోబోతోందా?

మహానటి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ని పెంచేసుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ సెట్ చేసుకోవడానికి కీర్తికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగడానికి ఆమె ఎంచుకున్న పాత్రలే మంచి గుర్తింపును తెచ్చాయి. ఇక రానున్న సినిమాలు కూడా అదే రేంజ్ లో క్లిక్కవుతాయని చెప్పవచ్చు. ఆమె చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలే ఉన్నాయి.

కీర్తి ప్రస్తుతం తన తెలుగు చిత్రం ‘మిస్ ఇండియా’ విడుదల కోసం ఎదురుచూస్తుండగా, నిర్మాణంలో ఉన్న చిత్రాలు ‘అన్నాతే’, ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్ దే’ మరియు ‘సాని కాగితం’. తమిళం, తెలుగు భాషల్లో ఆమె టాప్ హీరోలతో నటిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. కీర్తి సురేష్ సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ముందుగా ఒక వెబ్ సిరీస్‌ను సొంతంగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ యువ నటికి ఒక కథ బాగా నచ్చడంతో, అందుకే ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.