Forbes List: ఫోర్బ్స్ జాబితాలో మ‌హా సావిత్రి న‌టి.. కీర్తిసురేశ్ ట్వీట్‌!

Forbes List: మ‌ల‌యాళ భామ కీర్తిసురేశ్ ప్ర‌తిష్టాత్మ‌క ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో చోటు సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌హాన‌టిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు కీర్తిసురేశ్‌. అలనాటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో చ‌క్క‌ని అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించి అవార్డులు సైతం అందుకుంది. కీర్తి సురేశ్ న‌ట‌న‌కు జాతీయ అవార్డు వ‌చ్చింది. దీంతో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా చాలా పాపుల‌ర్ అయ్యింది కీర్తి.

keerthi suresh

ఇక తాజాగా Forbes List ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకుంది కీర్తి.. దేశ‌వ్యాప్తంగా 30ఏళ్ల లోపు వారి నుంచి 30మంది ప్ర‌తిభావంతుల‌ను ఎంపిక చేస్తూ.. Forbes List ఫోర్బ్స్ మేగ‌జైన్ ప్ర‌క‌టించింది. అందులో కీర్తి సురేశ్‌కు 28వ ర్యాంకును ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా కీర్తి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుతూ.. ప్ర‌తిష్టాత్మ‌క జాబితాలో చోటు ద‌క్కించుకున్నందుకు గ‌ర్వంగా ఉంద‌ని Forbes List ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ గుర్తింపు కెరీర్ ప‌రంగా కెరీర్ ప‌రంగా కీర్తి సురేశ్‌కు మ‌రింత ప్రోత్సాహాన్ని ఇస్తుంద‌ని చెప్ప‌చ్చు. అలాగే సోష‌ల్ మీడియాలో కీర్తిపై ప్ర‌శంస‌లు కురిపి‌స్తున్నారు నెటిజ‌న్స్‌.