కట్టప్ప కూతురు ఎవరో తెలుసా?

తమిళ నటుడు సత్యరాజ్ అంటే తెలియని వారు ఉండరు. రాజమౌళి బాహుబలి సినిమా నుండి ఆయనను కట్టప్ప అంటేనే ఎక్కువగా గుర్తుపడుతున్నారు. తమిళనాట ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ఆయన, ఆ తరువాత వయస్సు కొంచం పెరిగినప్పటి నుండి సైడ్ చరక్టర్లు బాగా చేస్తున్నారు. ఎందరో అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ఎందరో అగ్ర దర్శకుల సినిమాలలో పనిచేసారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఎక్కువగా బయట మాట్లాడారు. గట్టిగా మాట్లాడితే ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారనే సంగతి కూడా కొంతమందికి తెలీదు. అయితే అంతటి అగ్ర నటుడి కూతురు అయినప్పటికీ తన కూతురు దివ్య సత్యరాజ్ గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగానే ఉంటుంది. వృత్తి రీత్యా ఆమె న్యూట్రీషియన్ గా తన ప్రయాణం సాగిస్తుంది. మీడియాలో ఎక్కువగా కనిపించినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆమె సోషల్ మీడియా ఫోటోలు నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు.

https://www.instagram.com/divya_sathyaraj?utm_source=ig_web_button_share_sheet&igsh=ZDNlZDc0MzIxNw==