గౌరవనీయులు.. M.L.A..
టి. ప్రసన్నకుమార్ రెడ్డి గారూ..
సినిమా వాళ్ళు “బలిసి” కొట్టుకోవడం లేదు. “భయం” తో..
బతుకు జీవుడా.. అని కొట్టుమిట్టాడుతున్నారు.
ఒక పక్కన “కరోనా” వల్ల..భయంతో ప్రేక్షకులు థియేటర్ కి రాక, ఇంకో పక్కన.. మీరు టిక్కెట్స్.. రేట్లు తగ్గించడం..
ఆ పైన.. థియేటర్ లో.. సగం టిక్కెట్సే అమ్మాలనడం మూలంగా.. Exibitors..
బలిసి కాదు.. అలిసి.. సోలసి థియేటర్ లు మూసేస్తున్నారు.
ముఖ్యంగా.. నిర్మాతలు
పెట్టుబడులు పెట్టి.. వడ్డీలు కడుతూ.. సినిమాలు బిజినెస్ అవ్వకా, పని చేసిన ఆర్టిస్టులకు..టెక్నీషియన్స్ కి.. రెమ్యూనరేషన్స్ ఇస్తూ.. రిలీజ్ కి సరైన థియోటర్స్ దొరక్కా..
అనేక ఇబ్బందులు పడుతుంటే.. “సినిమా హాళ్ళు” వున్న మీరు..
” సినిమా వాళ్ళు”.. బలిసి కొట్టుకుంటున్నారు ” అనే మాట.. బుద్ది లేకుండా.. ఎలా అనబుద్ది ఏసింది సార్..? మా తెలుగు దర్శకుల సంఘంలో.. 2000 మంది సభ్యులుంటే..
వారిలో.. 500 మంది కే.. పని వుంటుంది. మిగతా వాళ్ళు ..
పని లేక, ఆదాయం లేక, ఆకలితో అప్పులు చేసుకుని బతుకుతుంటే.. ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..?
అలాగే టెక్నీషియన్స్.. సినిమాలలో పనిలేక.. ఫంక్షన్స్ లోనూ.. పెళ్ళిళ్ళ లోనూ.. Make-,up లు.. వేసుకుంటూ.. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ.. డెకరేషన్స్ చేసుకుంటూ.. బతుకుతున్నారు.
వీళ్ళు ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..?
” మా ” అసోసియేషన్ లో.. దాదాపు 1000 మంది.. ఆర్టిస్టులు.. ఆర్టిస్ట్ అసోసియేషన్స్ లో.. 600 మంది నటులుంటే .. పర బాషా నటులతోనూ ప్రవేశంతో.. డబ్బులు తీసుకోరని.. పెట్టుకునే.. సినిమా ఇంట్రస్టు వున్న కొత్తవాళ్ళ తాకిడితోనూ.. ఆర్టిస్టులు.. వేషాలు లేక అతలాకుతలం అవుతుంటే.. ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..? ఇక అతి ముఖ్యంగా.. రెక్కాడితే గాని డొక్కాడని..
మా ఫెడరేషన్ కార్మికులు.. జూనియర్ ఆర్టిస్టులు.. Wages పెరగక.. వచ్చిన డబ్బులతోనే..
ఎండనకా.. వాననకా.. రెక్కలు ముక్కలు చేసుకుని..
ఏ పూటకాపూట.. కడుపు నింపుకుంటుంటే.. ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..?
సినిమా వాళ్ళు.. సినిమా హాళ్ళు.. వల్ల.. మీకు ఏం నష్టం జరిగిందని అలా ‘కామెంట్’ చేశారు..?
తప్పు సార్.. ఒక ‘మాట’ అనేముందు వందసార్లు ఆలోచించాలి. Loose tougue తో.. ఆ మాట అని.. ఏమి సాధించారు..? ఇంతకు ముందు వరకూ. . సినిమా వాళ్ళలో.. మీ మీద ఎలాంటి నెగెటివ్ అభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు.. దాదాపు 50,000 కుటుంబాలను, సినిమా Hero లను అభిమానించే.. లక్షలాది అభిమానులను, సినిమాను ప్రేమించి.. చూసే కోట్లాది ప్రేక్షకుల మనసులను.. గాయపర్చడం
కరెక్ట్ కాదు సార్.. ఇప్పడు అందరి హృదయాలో..మీరు నెగెటివ్ పర్సన్ గా మిగిలిపోవడం తప్ప.. ఏమి సాధించారు..?
మా సినిమా వాళ్ళు.. ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టకుండా.. ఒక తపో దీక్షతో సినిమాలు తీసుకుంటూ.. ఆత్మగౌరవంతో బతుకుతారు. అంతేగానీ ఎవరినీ.. అనవసరంగా పరుష పదజాలంతో.. ‘కామెంట్’ చెయ్యరు. అంతెందుకూ..
మా వాళ్ళు ఎప్పుడైనా.. మీ రాజకీయ నాయకుల్ని.. “బలిసి కొట్టుకుటటున్నారు” అని అన్నారా..? చెప్పండీ ! ఒక కులాన్ని కామెంట్ చేస్తే.. ఆ కులం వాళ్ళందరూ.. గుంపుగా వచ్చి మీద పడిపోతారు. అలాంటిది.. మా సినిమా కులం వారిని.. మీరు ఇష్టమొచ్చినట్టు అవమానిస్తే.. మాకు బాధ కలగదా సార్ ! వినోధం ఇవ్వడం తప్ప.. సమాజానికి ఏ హానీ చేయని సినిమా వాళ్ళని.. దయ చేసి ఎప్పుడూ అనుమానించకండి.. అవమానించకండి. కదిరితే..
మా కుల దేవత..
” సినీ కళామతల్లి ” ని కాపాడే ప్రయత్నం చేయండి. అలాగే.. వీలుంటే.. టిక్కెట్స్ రేట్లు పెరగడానికి సాయం చెయ్యండి.. లేకపోతే.. సైలెంట్ గా వుండండి.
అంతే గానీ సినిమా వాళ్ళని.. అనవసరంగా అవమానించ వద్దు.
Please…..
వై. కాశీ విశ్వనాథ్
(సినిమా వాడు)