Trailer Talk: కార్తికేయ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ ట్రైల‌ర్ రిలీజ్‌..

Trailer Talk: ఆర్ఎక్స్‌100 చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తికేయ‌. ఇక ఆయ‌న న‌టించిన తాజా చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగుళ్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో.. గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌, టైటిల్‌సాంగ్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి. దీంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి..

ఈ క్ర‌మంలో మార్చి 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీంతో ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ భాగంగా తాజాగా చావు క‌బురు చ‌ల్ల‌గా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. బ‌స్తీ బాల‌రాజు, మ‌ల్లిగా లావ‌ణ్య త్రిపాఠి ఎంతో ఆక‌ట్టుకున్నారు. దీంట్లో రోజూ బ‌డికిపోయేటోడు బ‌ళ్లో పిల్ల‌ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు.. రోజూ ఉద్యోగానికి పోయేవాడు ఆఫీసులో పిల్ల‌ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు.. రోజూ చావుల‌కు వెళ్లేవాడు చావు ద‌గ్గ‌ర కాకుండా ఇంక ఎక్క‌డ ఇష్ట‌ప‌డ‌తాడు అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ ఎంతో అల‌రిస్తోంది. అలాగే ఇందులో కార్తికేయ డైలాగ్ డెలివ‌రీ ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించ‌గా.. మొత్తానికి ఈ చిత్రంపై మ‌రింత భారీ అంచ‌నాలు పెంచేసింది చావు క‌బురు చ‌ల్ల‌గా ట్రైల‌ర్Trailer Talk.