కార్తీ, రష్మిక జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కొత్త చిత్రం ప్రారంభం

Karthi's Next With Rashmika

‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభం అయ్యింది. కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సూర్య తో ‘ఎన్ జీ కె’, కార్తీ తో ఖైదీ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.

కార్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – వివేక్ – మెర్విన్, ఎడిటింగ్ – అంతొనీ, సినిమాటోగ్రఫీ – సత్యన్ సూర్యన్
నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
దర్శకత్వం – భాగ్యరాజ్ కన్నన్