పాటలు లేవు, హీరోయిన్ లేదు

సూర్య తమ్ముడిగా తమిళ, తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కార్తీ… రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి కాస్త దూరంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కార్తీ, ప్రస్తుతం ఖైదీ సినిమాలో నటిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఖైదీ సినిమాలో కార్తీ నటన సినిమాకై హైలెట్ గా నిలుస్తుందని తమిళ సినీ వర్గాల టాక్. వాస్తవానికి దగ్గరగా సాగే ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఖైదీ సినిమాలో పాటలు ఉండవని.. కనీసం హీరో కార్తీకి జోడీగా హీరోయిన్ కూడా ఉండదని అంటున్నారు. లోకేష్ కంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 26న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి కొత్త తరహా సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఖైదీ చిత్రాన్ని ఎంత వరకూ ఆదరిస్తారో చూద్దాం.