ఒక్క రాత్రికి వంద కోట్లు ఇచ్చారా? అరాచకం ఇది…

ఈ దీపావళికి ఖైదీ సినిమాతో తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకి వచ్చిన కార్తీ భారీ హిట్ అందుకున్నాడు. ఫాథర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి, ఎలాంటి డీవియేషన్స్ కి పోకుండా కేవలం కథ కథనంపైనే ద్రుష్టి పెట్టి ఈ సినిమా చేశారు. హీరోయిన్ లేదు, సాంగ్స్ లేవు… ఈ సినిమా మన ఆడియన్స్ ని ఎక్కడ అటాక్ చేస్తుందిలే అనుకున్నారు కానీ ఆడియన్స్ ఖైదీని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు.

kaithi

సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వావ్ ఫాక్టర్ ఇచ్చిన ఖైదీ రెండున్నర వారాల్లో 100కోట్ల వ‌సూళ్లు రాబట్టింది. సెలెక్టీవ్ గా మూవీస్ చేసే కార్తీ కెరీర్ లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ రీచ్ అయిన ఖైదీ, అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ రాబడుతున్నాడు. కలెక్షన్స్ రాబట్టడమే కాదు విజిల్ సినిమాకి భారీ షాక్ కూడా ఇస్తున్నాడు. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్‌బాబు, ఎస్‌.ఆర్.ప్ర‌భు నిర్మించారు.