కంగనా రనౌత్‌ ‘రైతు వ్యతిరేక’ ట్వీట్‌పై ఎఫ్‌ఐఆర్

కంగనా రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జెఎంఎఫ్‌సి) కోర్టు క్యతాసంద్ర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించింది. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేసిందని నటి కంగనా రనౌత్‌పై ఇటీవల న్యాయవాది ఎల్ రమేష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని ఒక కోర్టు పోలీసులను ఆదేశించింది.

దర్యాప్తు కోసం సిఆర్‌పిసి సెక్షన్ 156 (3) కింద ఫిర్యాదు చేసినట్లు కర్ణాటక కోర్టు తెలిపింది. క్యతాసంద్రకు చెందిన రమేష్ నాయక్, నటిపై తన క్రిమినల్ కేసుకు సంబంధించి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించాలని కోర్టు అధికార పరిధిలోని పోలీస్ స్టేషన్ను ఆదేశించడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. వ్యవసాయ కోసం కష్టపడుతున్న వారిని వ్యతిరేకిస్తు ఆ వ్యక్తులను మనసులను గాయపరిచిందని, కంగనా ట్వీట్ లో స్పష్టమైన ఉద్దేశం ఉందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నాడు. అదే విధంగా ఆమె అల్లర్లను కలిగించే ఉద్దేశంతో రెచ్చగొట్టాలని కామెంట్ చేసిందని సమాజంలోని యువ మనస్సులలో అహింసా సంస్కృతిని ప్రోత్సహిస్తోందని అన్నారు.