చీప్ డ్రెస్‌లో కరీనా.. మరి ఇంత చీపా?

సెలబ్రెటీలు అంటేనే లగ్జరీ. లగ్జరీగా జీవిస్తూ ఉంటారు. ఫ్యాషన్, ట్రెండ్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దుస్తుల దగ్గర నుంచి చెప్పుల వరకు ప్రతీది మంచి బ్రాండ్, అత్యధిక ధర కలిగినది మాత్రమే వాడతారు. వాళ్లు బయటికి ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులను ఆకర్షించేలా దస్తులు ధరిస్తారు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అత్యంత తక్కువ గల చీప్ డ్రెస్‌ల్లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

kareena kapoor

ఇంతకు ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్. తాజాగా రూ.1790 విలువ చేసే సాధా సీదా డ్రెస్‌లో కరీనా కనిపించి అభిమానులను షాక్‌కు గురి చేసింది. పుదీనా ఆకుపచ్చ రంగు దుస్తుల్లో కరీనా కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలా సాధా సీదా దుస్తుల్లో కరీనాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం కరీనా గర్భవతిగా ఉంది. అందుకనేఇలా సాధా సీదా దుస్తులను ధరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కరీనా-సైప్ అలీ ఖాన్ దంపతులకు ఒక బిడ్డ జన్మించగా… త్వరలో రెండో బిడ్డకు కరీనా జన్మనివ్వనుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కరీనా.. త్వరలో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించనుంది.