నా రెండవ ప్రెగ్నెన్సీ పై తైమూర్ ఏమన్నాడంటే..: ‘కరీనా కపూర్’!!

ఇటీవలి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్ తన రెండవ గర్భం పట్ల తైమూర్ ఎలా స్పందించారో తెలియజేశారు. తన చిన్న బాబు పెద్ద సోదరుడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపింది. కరీనా కపూర్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్ తమ రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తైమూర్ అలీ ఖాన్ త్వరలో పెద్ద సోదరుడు కానున్నట్లు సైఫ్ తన పిఆర్ బృందం ద్వారా సందేశం పంపగా ఒక్కసారిగా ఆ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యింది.

అప్పటి నుండి అందరి దృష్టి కరీనా వైపే మళ్లింది. ఆమె బిడ్డ బంప్‌ కి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో, కరీనా తన రెండవ గర్భంపై తైమూర్ ఇచ్చిన సమాధానాల గురించి మాట్లాడింది. అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చిన్న బాబు పెద్ద అన్నయ్య అవుతున్నందుకు చాలా సంతోశిస్తున్నాడు. నాకు స్వీట్ క్రైమ్ పాట్నర్ కూడా రానున్నట్లు చెబుతూ తనను నేను చాలా బాగా చూసుకుంటానని అంటున్నాడు. తైమూర్ తన వయస్సు కంటే చాలా ముందున్నాడు. మేము కూడా అతనిని సమానమైన పెద్దవాడిలానే చూస్తామని కరీనా వివరణ ఇచ్చింది.