Kareenakapoor: మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన క‌రీనా..

Kareenakapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బెబో క‌రీనాక‌పూర్‌, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దంప‌తుల‌కు ఐదేళ్ల కుమారుడు తైమూర్ ఉన్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఇక తాజాగా మ‌రో సారి మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది క‌రీనా. కాన్పు కోసం నిన్న‌రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చేరిన ఆమె..ఈ రోజు ఉద‌యం పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. Kareenakapoorత‌ల్లి బిడ్డా పూర్తి ఆరోగ్యంగా ఉన్న‌ట్లు కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు.

kareena

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. దీంతో క‌రీనా-సైఫ్ దంప‌తుల‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. Kareenakapoorక‌రీనా-సైఫ్ 2012లో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ దంప‌తుల‌కు 2016లో తైమూర్ అలీఖాన్ జ‌న్మించాడు. ఇక వీరి సినిమాల విష‌యాన్ని కొస్తే.. Kareenakapoorక‌రీనా ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం లాల్‌సింగ్ చ‌ద్దా సెట్స్‌మీద ఉంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ న‌టిస్తున్నారు. అలాగే సైఫ్ అలీఖాన్ ప్ర‌స్తుతం యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేస్తున్న ఆదిపురుష్ చిత్రంలో రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఇది సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ డైరెక్ష‌న్ చేస్తున్నాడు.