న‌గ్నచిత్రాల‌తో వేదింపులు.. క‌రాటే క‌ళ్యాణి అండ‌తో పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన యువ‌తి!

ఓ యువ‌తిని ఓ పాస్ట‌ర్ పెళ్లి చేసుకుంటాన‌ని శారీర‌కంగా లొంగ‌దీసుకుని.. త‌న న‌గ్న చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో సినీ నటి క‌రాటే క‌ళ్యాణి అండ‌తో ఆ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. తూర్పుగోదావ‌రి జిల్లాలోని క‌డియంలో రెడ్డిప‌డ‌ల్లి గ్రామానికి చెందిన మ‌ద్దుకూరి ప్రియాంక ఏడేళ్లుగా కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఆల్కాట్ గార్డెన్స్ ప్రాంతంలోని ఒలీవ‌ల చర్చికి వెళుతోంది. అక్క‌డ పాస్ట‌ర్ షారోన్ కుమార్ ఏకాంత ప్రార్థ‌న‌ల‌ను ప్రోత్సహించేవాడు.

karate kalyani issues

త‌న భార్య‌తో విడాకులు తీసుకుంటున్నాన‌ని.. నిన్ను ప్రేమిస్తున్నాన‌ని త్వ‌ర‌లో మ‌న‌మిద్ద‌రం పెళ్లిచేసుకుందాం అని న‌మ్మించి శారీర‌కంగా లొంగ‌దీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే న‌గ్నంగా వీడియోలు తీసి తన ఫోన్‌లో ఉంచుకున్నాడు. ఇప్పుడ ఆ ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తానంటూ భ‌య‌పెడుతున్నాడు. ఈ విష‌యం ఎవ‌రికి చెప్పాలి అనే ఆలోచ‌న‌లో ప‌డ్డా.. ఈ క్ర‌మంలో కొంద‌రి స‌హ‌కారంతో సినీ ఆర్టిస్ట్ క‌రాటే క‌ళ్యాణి ని క‌లిసి త‌న బాధ చెప్పుకున్నాన‌ని.. ఆమె ధైర్యంతోనే పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేశాన‌ని ప్రియాంక వివ‌రించింది.