అమెరికా ‘కన్నప్ప’ ప్రమోషన్స్ హల్చల్

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం నుంచి రిలీజయిన పాటలు అయితే కన్నప్పపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి.

కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు కన్నప్ప సినిమా నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మధుబాల.. వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు.

జూన్ 27 న కన్నప్ప సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విష్ణు మంచు కన్నప్ప మూవ్‌మెంట్ ని మే 8 నుంచి అమెరికాలో మొదలుపెట్టనున్నారు. గ్రాండ్ గా ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ ని చేయనున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ చిత్రం కన్నప్ప రిలీజ్ కి ముందే ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చరిత్ర సృష్టించనుంది.

అమెరికాలోని న్యూ జెర్సీలో కన్నప్ప రోడ్ షోతో మొదలుపెట్టి ఆ తర్వాత డల్లాస్, లాస్ ఏంజిల్స్ లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సినిమాలోని ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ వర్కింగ్ విజువల్స్ కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ కి చూపించనున్నారు. కన్నప్ప సినిమాని ఇండియాతో పాటు అమెరికాలో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విష్ణు మంచు.

ఇప్పటికే కన్నప్ప సినిమా విజువల్స్, సినిమాలోని భక్తి భావాన్ని ప్రేక్షకులు గొప్పగా ఊహించుకుంటున్నారు. ఈ కన్నప్ప మూవ్‌మెంట్ తో విష్ణు మంచు కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే చేయడం కాకుండా గ్లోబల్ ఆడియన్స్ కి గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. కన్నప్ప ప్రయాణం మే 8 నుంచి ప్రారంభం కానుంది. ఒక కొత్త భక్తి భావం, కథ, సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.