FLASH: ఆత్మహత్య చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్

Jayashree Ramaiah Suicide: కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగూళురులోని తన ఇంట్లో ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. డిప్రెషన్ కారణంగా ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని సంధ్య కిరణ ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంది. అయినా డిప్రెషన్ భరించలేక ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది.

Jayashree Ramaiah Died

దీనిపై పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నడలో ఉప్పు హులి కారా, కన్నడ గొత్తిల్లా సినిమాల్లో జయశ్రీ నటించింది. ఇక కన్నడ బిగ్‌బాస్ 3లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జయశ్రీకి సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో గత కొంతకాలంగా డిప్రెషన్‌తో ఆమె బాధపడుతోంది.