
‘బ్లాక్ వైట్ & గ్రే : లవ్ కిల్స్’, ‘ది వేకింగ్ ఆఫ్ ది నేషన్’ వంటి సూపర్ హిట్ షోలను అందించిన తర్వాత సోనీ లీవ్ నుంచి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘కాన్ ఖజురా’ రాబోతోంది. అత్యంత ప్రతిభావంతులైన రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డయాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మే 30న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది.
‘కాన్ ఖజురా’ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అపరాధ భావన, రహస్యాలతో సాగించే జీవితం, ప్రతీకారంతో రగిలే వ్యక్తులను ఈ ట్రైలర్ మనకు చూపిస్తోంది. ఇది మాక్స్ (మోహిత్ రైనా), అషు (రోషన్ మాథ్యూ) అనే ఇద్దరు సోదరుల కథను మనకు చెబుతోంది. వారు జ్ఞాపకశక్తిని కోల్పోయి.. వాస్తవికతను తెలుసుకోలేక.. తమ చీకటి గతాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ‘కాన్ ఖజురా’ అనేది అత్యంత ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే.

నటి సారా జేన్ డయాస్ మాట్లాడుతూ.. ‘‘కన్ ఖజురా’లో గ్రిప్పింగ్ స్టోరీ ఉంది. అపరాధం, కుటుంబం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి ఎన్నో అంశాలున్నాయి. నిషా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి మల్టీ లేయర్ పాత్రను పోషించడం అంత సులభం కాదు’ అని అన్నారు.
‘కన్ ఖజురా’లో మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా, ఉషా నద్కర్ణి వంటి ప్రతిభావంతులైన నటీనటులు పని చేశారు. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. అజయ్ రాయ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఆడమ్ బిజాన్స్కి, ఓమ్రీ షెన్హార్, డానా ఈడెన్ ఈ షోను సృష్టించారు. యస్ స్టూడియోస్ లైసెన్స్‌తో రానున్న ఈ సిరీస్‌కు డోనా, షులా ప్రొడక్షన్స్ సపోర్ట్‌గా నిలిచాయి. మే 30 నుండి సోనీ LIVలో ‘కన్ ఖజురా’ ప్రత్యేకంగా ప్రసారం కానుంది.