నేడు దివంగ‌త‌ జ‌య‌లలిత జ‌యంతి.. త‌లైవి రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసిన కంగ‌నా!

దివంగ‌త ప్ర‌ముఖ న‌టి, త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా త‌లైవి చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో త‌లైవి టైటిల్ పాత్ర‌ను బాలీవుడ్ లేడి ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తోంది. ఈ చిత్రానికి త‌మిళ్ డైరెక్ట‌ర్ ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. ఈ చిత్రం కోసం అటు జ‌య‌ల‌లిత అభిమానులు, త‌మిళ‌నాడు ప్రేక్ష‌కులు, మ‌రోవైపు కంగ‌నా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి ప‌లు పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. అయితే ఈ రోజు ఫిబ్ర‌వ‌రి 24న జ‌య‌ల‌లిత జ‌యంతి సంద‌ర్భంగా ..

kangana

ఈ చిత్రానికి సంబంధించి స‌రికొత్త అప్‌డేట్‌ను స్వ‌యంగా కంగ‌నా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. త‌లైవి చిత్రాన్ని ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి ఈ చిత్రం గ‌తేడాది జూన్‌లో విడుద‌ల కావ‌ల్సి ఉంది. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ఈ చిత్రం జ‌య‌ల‌లిత ఫ్యాన్స్‌, కంగ‌నా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక ఇందులో ఎంజీఆర్‌గా అర‌వింద్ స్వామి, క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్‌, శ‌శిక‌ళ పాత్ర‌లో పూర్ణ న‌టిస్తున్నారు.