జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కంగనా సంచలన ట్వీట్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోగా.. కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది. దీంతో కాంగ్రెస్‌పై కంగనా రనౌత్ సెటైర్లు పేల్చింది. ‘ప్రియమైన కాంగ్రెస్‌.. మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ నా నామం జపం చేస్తూ గందరగోళం చేస్తుంటే.. బీజేపీ మాత్రం తన పాలనతో క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అని కాంగ్రెస్‌పై కంగనా విమర్శలు కురిపించింది.

kangana ranout

కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మా రాజకీయాల గురించి నీకెందుకు అని కౌంటర్ ఇస్తున్నారు. గత కొంతకాలంగా బీజేపీకి కంగనా సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మోదీని తెగ పొగిడేస్తున్న ఈమె.. కాంగ్రెస్‌పై విమర్శనస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల క్రమంలో కాంగ్రెస్‌ను కంగనా టార్గెట్ చేసింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చాలామంది అనుకున్నారు. పోస్టర్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అత్యధిక ఓట్లను సాధించింది. దీనిని బట్టి కానీ టీఆర్‌ఎస్‌కు బీజేపీ బాగా పోటీనిచ్చిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ మాత్రం దారుణంగా డీలాపడింది. కేవలం 2 సీట్లకు మాత్రం సాధించింది