కంగనాకు షాకిచ్చిన రైతులు

కేంద్రం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్దిరోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. చలిని సైతం లెక్క చేయకుండా రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమానికి పలువురు సెలబ్రెటీలు మద్దతు తెలిపారు. మరికొంతమంది సెలబ్రెటీలు స్వయంగా రైతుల ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఇంకా కొంతమంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా రైతులకు మద్దతు తెలుపుతున్నారు.

kangana ranaut

కానీ రైతులు ఉద్యమాన్ని కించపరుస్తూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఉద్యమం చేస్తున్న రైతులను దేశ వ్యతిరేకులతో పొల్చిన కంగనా.. రూ.100 ఇస్తే ఇలాంటివారు చాలామంది దొరుకుతారని విమర్శలు చేసింది. దీంతో రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆమెపై అనేక కేసులు నమోదు అయ్యాయి.

బీజేపీ అనుకూల వ్యక్తిగా కంగనాపై ముద్ర వేశారు. ఈ క్రమంలో పంజాబ్ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌లో కంగనా సినిమాలను అడ్డుకోవాలని రైతులు నిర్ణయించారు. ప్రస్తుతం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో కంగనా నటిస్తోంది. దీని తర్వాత తేజస్ సినిమాలో నటించనుంది.