Bollywood: ఇందిరాగాంధీ పాత్ర‌లో కంగ‌నా‌.. కానీ ఇది బ‌యోపిక్ కాద‌ట‌..

Bollywood: బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కొంత మంది ప్ర‌ముఖుల జీవిత క‌థ‌ల‌పై సినిమాలు తీయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నట్లు క‌నిపిస్తోంది. కంగనా తాజా చిత్రం ప్ర‌ముఖ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు దివంగ‌త జ‌య‌లలిత బ‌యోపిక్ త‌లైవిలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది.. ఇక ఇప్పుడు తాజాగా పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క మూవీలో కంగ‌నా మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో అల‌రించ‌నుంది.

Bollywood కానీ ఇది ఇందిరాగాంధీ బ‌యోపిక్ కాద‌ని, ఇదొక పొలిటిక‌ల్ డ్రామా అని, ఇప్ప‌టిత‌రానికి అర్థ‌మ‌య్యే విధంగా ఉండ‌నుంద‌ని కంగ‌నా అన్నారు. ఈ మూవీలో ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తార‌ని.. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌లేద‌ని.. ఈ ప్రాజెక్టుపై ప‌నిచేస్తున్నామ‌ని.. స్ర్కిప్ట్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని కంగ‌నా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సాయి క‌బీర్ ద‌ర్శ‌క‌త్వంలో.. Bollywood మ‌ణిక‌ర్ణిక ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని కంగ‌నా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం కంగ‌నా తేజ‌స్ అనే చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుంది.‌