ఊర్మిళ ఒక సాఫ్ట్ పోర్న్ స్టార్- కంగనా రనౌత్

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గత కొంత కాలంగా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సుశాంత్ సింగ్ మరణం నుంచి ఇప్పటివరకూ ఇండస్ట్రీలోని లొసుగులని ఎత్తి చూపుతూనే ఉన్న కంగనా ఇంటిని రీసెంట్ గా కూల్చేశారు. ఈ సంఘటన కంగనలో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. అప్పటివరకూ ఇండస్ట్రీనే టార్గెట్ చేసిన కంగన, ఈ ఘటన జరగడంతో ప్రభుత్వాన్ని, శివసేన నాయకులని కూడా వదలకుండా మాటల తూటాలు పేలుస్తునే ఉంది.

బాలీవుడ్ డ్రగ్స్ గురించి మాట్లాడిన కంగనాపై ఒకప్పటి అందాల తార ఊర్మిళ … డ్రగ్స్ ఎక్కువగా వాడేదే హిమాచల్ ప్రదేశ్ లో, ముంబైలో కూర్చొని నీతులు చెప్పడం కన్నా కంగనా సొంత రాష్ట్రాన్ని పట్టించుకోవడం మంచిది అని హాట్ కామెంట్స్ చేసింది. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ మాటలకి స్పందించిన కంగన, ఊర్మిళ ఒక సాఫ్ట్ పోర్న్ స్టార్ అని, ఆమెకి నటన కన్నా గ్లామర్ కే పేరొచ్చిందని ఘాటుగా స్పందించింది. తన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడిన కంగనా, ఊర్మిళ లాంటి వాళ్లకే టికెట్ వస్తుంటే నాకు ఎందుకు రాదని ఊర్మిళకి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ కంగనా vs బాలీవుడ్ వివాదం ఇంకెంత దూరం పోతుందో చూడాలి.