టాలీవుడ్ ముందు బాలీవుడ్ పనికి రాదు- కంగనా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధనగర్ జిల్లా నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని సీఎం అధికారులను కోరిన యోగి… నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ ప్రెస్ వే సమీపంలో స్థలాన్ని చూసి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. బాలీవుడ్ వర్గాలు ఈ విషయమై చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ కంగనా కూడా యోగి డెసిషన్ పై తన ఒపీనియన్ చెప్తూ, ప్రపంచం అంతా ఇండియాలో అతిపెద్ద సినిమాలు బాలీవుడ్ వాళ్లు చేస్తారని అనుకుంటుందని. అది నిజం కాదు టాలీవుడ్ చాలా ఎదిగిందని, పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద ఇండస్ట్రీగా ఎదిగిందని చెప్పింది.

దేశంలో ఏ పెద్ద సినిమా అయినా రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకుంటుందని, సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న స్టూడియో నిర్మాణ నిర్ణయం చాలా మంచిదని, దాన్ని ఆమె స్వాగతిస్తున్నానని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. కంగనా యోగిని సపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాలో ఉన్న ముఘల్ మ్యూజియంకి కూడా ఛత్రపతి శివాజీ మ్యూజియంగా పేరు మార్చమన్నప్పుడు కూడా కంగనా యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని కొనియాడింది. గత కొంత కాలంగా కంగనా జీవితంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వారు, ఆమె బీజేపీలో చేరుతుందనే అంచనాలు వేసి చెప్తున్నారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీ ముఖ్యమంత్రులు చేసే పనులకి కంగనా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం చూస్తుంటే అది నిజమే అనిపించక మానదు.