వైరల్‌గా మారిన ‘తలైవి’ స్టిల్స్

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఈ బయెపిక్‌కు తలైవి అనే టైటిల్ పెట్టారు. ఇందులో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా.. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. విష్ణు ఇందరూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

KANGANA RANOUT

అరవిందస్వామి, ప్రకాష్ రాజ్, భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా… కంగనా రనౌత్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు జయలలిత వర్థంతి సందర్భందగా తలైవి సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఈ స్టిల్స్‌లో జయలలిత లుక్‌లో కంగనా అబ్బురపరుస్తోంది. చూడటానికి అచ్చం జయలలితలా చీరకట్టులో కంగనా కనిపించింది. ఇంతటి గొప్ప నాయకుల కథ చేయడం సంతోషంగా ఉందని, ఇంకా ఒక్క వారంమాత్రమే ఉందంటూ కంగనా ట్వీట్ చేసింది