ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్

రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ నిన్న సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అభినందనలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ నేతలు హాజరై అభినందలు అందించారు