గ్యాంగ్‌స్టర్‌గా ఎంజీఆర్ డూప్‌.. క్లాప్ కొట్టిన క‌మ‌ల్‌హాస‌న్‌!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ గ్యాంగ్‌స్ట‌ర్‌-21 చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో తొలి క్లాప్ కొట్టారు. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జూనియ‌ర్ ఎంజీఆర్‌గా గుర్తింపు ఉన్నా న‌టుడు వి. రామ‌చంద్ర‌న్ హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఎంజి. రామ‌చంద్ర‌న్ 104వ జ‌యంతి సంద‌ర్భంగా గ్యాంగ్‌స్ట‌ర్‌-21 చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు చిత్ర‌బృందం. ఎంజీఆర్ స్మార‌క‌వ‌నంగా మారిన రామావ‌రంలోని ఎంజీఆర్ నివాసంలో

gangster-21 kamalhassan

ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి అతిథిగా క‌మ‌ల్‌హాస‌న్ విచ్చేసి తొలి క్లాప్ కొట్టాడు. ఇక‌ ఈ సినిమా గ్యాంగ్‌స్ట‌ర్ జీవ‌త క‌థాంశం ఆధారంగా రూపొందుతుండ‌గా.. ఏడీఆర్ ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు ర‌త‌న్ లింగ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎంఎన్ వీర‌ప్ప‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.