కమల్ హాసన్’ న్యూ మూవీకి టైటిల్ కన్ఫామ్

విశ్వనటుడు కమల్ హాసన్-లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రానున్న సినిమాకు సంబంధించి టైటిల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఎవనేంద్రు నినైత’ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. రేపు కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్ టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేయనుంది. కమల్ హాసన్ చేస్తున్న 232వ సినిమా ఇది.

KAMAL HASAN

ఈ సినిమా టీజర్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ టీజర్ చాలా స్పెషల్‌గా ఉండనుందట. అభిమానులకు టీజర్ మంచి సర్‌ప్రైజ్‌ను అందిస్తుందట. టీజర్ చూసిన తర్వాత అభిమానులు థ్రిల్లింగ్‌కు గురవుతారని సినిమా యూనిట్ చెబుతోంది.

దీపావళి తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే నటీనటులను ఎంపిక చేయనున్నారట. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.