కమల్‌హాసన్‌కు సర్జరీ… స్పందించిన శృతిహాసన్

లోకనాయకుడు కమల్‌హాసన్ కాలి నొప్పితో గత కొద్దిరోజుల క్రితం హాస్పిటల్‌లో చేరగా.. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల క్రమంలో కమల్ తన పార్టీ తరపున గత కొద్దినెలలుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతున్నారు. దీని కోసం తన సినిమా షూటింగ్‌లను కూడా కమల్ వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో కమల్ కాలి నొప్పితే హాస్పిటల్‌లో చేరడంతో.. ఆయన ఆరోగ్యం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Kamal Haasan SURGERY

దీంతో కమల్ ఆరోగ్యంపై ఆయన కూమార్తెలు శృతిహాసన్, అక్షర ఒక ప్రకటన విడుదల చేశారు. తన తండ్రి కాలికి సర్జరీ చేశారని, ఆ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పారు. ‘నాలుగైదు రోజులపాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్‌లోనే ఉంటారు. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు.. నాన్న కోలుకోవాలని ప్రార్ధించినవారందరికీ థ్యాంక్స్’ అంటూ శృతి హాసన్, అక్షర హాసన్ ప్రకటనలో పేర్కొన్నారు.