గోవుల అక్ర‌మ ర‌వాణాను అడ్డుకున్న న‌టి క‌ళ్యాణి!

అక్ర‌మంగా గోవుల‌ను త‌ర‌లిస్తున్న నిందితుల‌పై క‌రాటే క‌ళ్యాణి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. క‌రాటే క‌ళ్యాణి బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని అలరించింది. హౌస్‌లో ఉన్న‌ది రెండు వారాలే అయినా త‌న ఆట పాట‌ల‌తో అల‌రిస్తూనే వివాదాస్ప‌ద కంటెస్టెంట్ హౌస్‌ను హ‌డ‌లెత్తించి రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే అనంత‌రం బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. తాజాగా యాద్రాద్రి జిల్లాలోని బీబీన‌గ‌ర్‌లో రెండు బొలెరో వాహ‌నాల్లో త‌ర‌లిస్తున్న ఆవుల‌ను క‌ళ్యాణి అడ్డుకున్నారు.

karate kalyani

దీంతో ఆమె 25 గోవుల‌ను కాపాడి గోశాల‌కు త‌ర‌లించారు. అంతేకాకండా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. నిందితుల‌పై గోవ‌ధ నిషేధం చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇటీవలే ఏపీలో జ‌రిగిన రామ‌తీర్థం ఘ‌ట‌న‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో నిర‌స‌న‌లు తెలిపింది. ఇక ప‌లు సినిమాల్లో న‌టిస్తూ.,. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంటున్న క‌రాటే క‌ళ్యాణి రాజ‌కీయ నాయ‌కురాలిగా కూడా త‌న స‌త్తా చాటుతుంది.