అఖిల్ హీరోయిన్ ని ప్రేమలో పడేసిన ఇతనెవరో తెలుసా?

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. సౌత్ ఇండియాలో దర్శకుడిగా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి, ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన ప్రియదర్శన్ కూతురే కళ్యాణి ప్రియదర్శన్. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి, రీసెంట్ గా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీతో మంచి హిట్ అందుకుంది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది.

తాను రిలేషన్ లో ఉన్నానని పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటానని చెప్పిన కళ్యాణి ప్రియదర్శన్, ఆ అదృష్టవంతుడు ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కళ్యాణి ప్రియదర్శన్ గురించి తెలిసిన వాళ్లు మాత్రం అది ప్రణవ్ అనే అనుకుంటున్నారు. ఇంతకీ ప్రణవ్ ఎవరు అనే కదా మీ డౌట్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకే ఈ ప్రణవ్. మోహన్ లాల్, ప్రియదర్శన్ కుటుంబాలకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వీరి కలయికలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్నో హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్ లో ఒక భారీ పీరియాడికల్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాల కారణంగా ప్రియదర్శన్ కూతురు కళ్యాణి, మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ చిన్నప్పటి నుండి కలిసి మెలిసి పెరిగారు. అది ఇప్పుడు ప్రేమగా మారి ఉంటుందని ఆమె సన్నిహితులు నుంచి వస్తున్న సమాచారం. లాల్ కొడుకు, ప్రియదర్శన్ కూతురి పేమ… పెళ్లి పీటలు ఎక్కేది ఎప్పుడో చూడాలి. కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్ లాల్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు.