ఎంత మంచి వాడవురా కూడా సంక్రాంతికే… బరిలో ఫ్యామిలీ సినిమా

2017 సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్యలో శర్వానంద్ నటించిన చిన్న సినిమా వస్తుంది అనగానే, శర్వాకి ఏం అయ్యింది? ఎందుకు థియేటర్స్ లేని టైములో రిస్క్ చేస్తున్నాడు, సినిమాకి నష్టం వస్తే ఎలా అనే అనుమానాలు ఉండేవి కానీ వాటిని తలకిందులు చేస్తూ శతమానం భవతి సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న, నందమూరి హీరోతో కలిసి చేస్తున్న సినిమా ఎంత మంచి వాడవురా. రీసెంట్ గా బయటకి వచ్చిన ఈ సినిమా టీజర్, ఫ్యామిలి ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. కళ్యాణ్ రామ్ లుక్ కూడా బాగుంది.

kalyan ram

రెండేళ్ల క్రితం మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ సతీష్ వేగేశ్న ఎంత మంచి వాడవురా సినిమాని సంక్రాంతి రేస్ లో నిలబెడుతున్నాడు. మహేశ్, బన్నీ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా కళ్యాణ్ రామ్ సంక్రాంతి రావడానికి వెనకాడట్లేదు అంటే తన సినిమా కంటెంట్ పై ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకూ ఎంత మంచి వాడవురా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానం ఉండేది కానీ రేస్ లో ఉన్న సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఎంత మంచి వాడవురా చిత్ర యూనిట్ కూడా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. మరి రెండు కమర్షియల్ సినిమాల మధ్యలో వస్తున్న ఎంత మంచి వాడవురా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.