మంచి మనసున్న మనిషి, బహుముఖ ప్రజ్ఞాశాలి, లెజెండ్ విజయనిర్మల గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆవిడ హఠాన్మరణాన్ని సంతాపంగా గురువారం సాయంత్రం నిర్వహించాలననుకున్న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశామని కల్కి టీమ్ తెలిపింది. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శివాని శివాత్మిక, వైట్ లాంబ్ పిక్చర్స్ వినోద్ కుమార్ సమర్పణలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించిన సినిమా కల్కి. ప్రపంవ్యాప్తంగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ విడుదల చేస్తున్నారు.
శుక్రవారం (జూన్ 28న) విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా బుధవారం సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గురువారం సాయంత్రానికి వాయిదా వేశారు. విజయనిర్మల గారి ఆకస్మిక మరణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.