ఓటీటీలోకి ‘కళ’

నాగేంద్రవర్మ ప్రొడక్షన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి “ఫణి గణేష్”ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగేంద్రవర్మ బిరుదురాజు నిర్మించిన పీరియాడిక్ ఫిల్మ్ “కళ”. “ది ఉమెన్” అన్నది ట్యాగ్ లైన్. సోనాక్షివర్మ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో భరత్ రాజ్, సుజన్ రాజ్, గణేష్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం యాభై ఏళ్ళ క్రితం సమాజంలోని పరిస్థితులకు అద్దం పడుతూ రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఊర్వశి ఓటిటి’ ద్వారా త్వరలో విడుదల కానుంది.

OTT KALA

ఈసందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “కళ’ అనే అమ్మాయి జీవితంలో రేగిన కలకలం ఏమిటన్నది అందరి హృదయాలకు హత్తుకునేలా చూపించే చిత్రం “కళ”. యాభై ఏళ్ళ క్రితం నాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ పీరియడ్ ఫిల్మ్ గా తెరకెక్కించాం. డ్రామాతోపాటు సస్పెన్స్ మేళవించి రూపొందిన ‘కళ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అభినయం, ఛాయాగ్రహణం, సంగీతం, సంభాషణలు.. ‘కళ’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయి. మా చిత్రం “ఊర్వశి” ఓటిటి” ద్వారా విడుదలవుతుండడం ఆనందంగా ఉంది” అన్నారు.