సిగరెట్ తాగుతున్న కాజల్.. ఫొటోలు వైరల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు.

kajol cigarate photos viral

అయితే దీంతో పాటు లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌లో కూడా కాజల్ నటిస్తోంది. వెంకట్ ప్రభు దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. నిన్నటి నుంచి తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కాజల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో భాగంగా కాజల్ సిగరెట్ తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.