వారిని చూస్తేనే కోపం వచ్చేస్తుందన్న కాజల్

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి ప్రస్తుతం చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ ఈ అమ్మడు బిజీబిజీగా గడుపుతోంది. రెండు నెలల క్రితమే ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లును లవ్ మ్యారేజ్ చేసుకుని కొత్త లైఫ్‌ను కూడా స్టార్ట్ చేసింది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఈ భామ బాగా యాక్టివ్‌గా ఉంటుంది.
భర్తతో దిగిన ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంది.

KAJOL ABOUT LIES

మరవైపు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక అభిమాని మీకు కోపం ఎందుకు వస్తుంది అని ప్రశ్నించాడు. దీనికి కాజల్ సమాధానం ఇస్తూ.. ‘హిపోక్రసీ, అబద్ధాల విషయాల్లో గతంలో చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం హిపోక్రసీ ఉన్న వాళ్లను, అబద్ధాలు ఆడేవాళ్లను చూస్తే పాపం అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. ఇక ఉదయం లేవగానే ఏం చేస్తారు అని మరో అభిమాని ప్రశ్నించగా.. ‘పెద్ద గ్లాస్‌ వేడి నీళ్లలో పసుపు, అల్లం వేసుకుని తాగుతాను. అలాగే మా ఆయనకో పెద్ద హగ్‌ ఇస్తాను’ అని తెలిపింది.