వినాయకచవితిని డబ్బులకోసం వాడేసిన కాజల్..

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తోంది. అక్కడ మంచి ఆఫర్స్ వస్తుండడంతో పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇక పెళ్లికి ముందే వీలైనంత వరకు ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న కాజల్ రీసెంట్ గా వినాయకచవితి ఫెస్టివల్ ని కూడా కమర్షియల్ బిజినెస్ కోసం వాడినట్లు ట్రోలింగ్స్ వస్తున్నాయి.

ఒక ఆగార్ బత్తి ప్యాకెట్ గురించి స్పెషల్ గా రివ్యూ ఇచ్చిన కాజల్ పండగ సమయాల్లో అత్యంత భక్తి శ్రద్దను కలిగించే ఆయుధం ఇదేనని అమ్మడు అందుకు సంబంధించిన ప్యాకెట్ గురించి గట్టిగానే ప్రచారం చేసింది. అయితే కమర్షియల్ గా ఆలోచించి డబ్బుల కోసమే కాజల్ ఈ విధంగా చేస్తోందని కామెంట్స్ రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. మరి ఆ విమర్శలకు కాజల్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం కాజల్ మంచు విష్ణుతో మోసగాళ్ళు సినిమాతో పాటు మెగాస్టార్ ఆచార్య సినిమాలో కూడా నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో ముంబై సాగా, కోలీవుడ్ లో ఇండియన్ 2 సినిమాతో పాటు మరో రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.