‘సంజనా’తో కలిసి కాసినో ఆడుతున్న ‘కాజల్’.. ఫొటో వైరల్!!

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వివాదం ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా హీరోయిన్స్ పేర్లు బయటకు రావడంతో త్వరలోనే మరికొందరి పేర్లు కూడా త్వరలోనే బయటపడనున్నాయనే వార్తలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల ఎన్‌సీబీ అధికారులు న‌టి రాగిణి దివ్వేదీతో పాటు సంజ‌న‌ని అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

ఇక వీరితో ఎక్కువగా క్లోజ్ గా ఉండేవారిని కూడా స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక వీరి పేర్లు వైరల్ అవుతున్న తరుణంలో చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్, సంజ‌న‌తో క‌లిసి ఒక కాసినో గేమ్ ఆడుతున్న ఫొటో బయటపడింది. ఆమె డ‌బ్బులు పెడుతున్నట్లు ఉండడంతో అనేక రకాల రూమర్స్ పూట్టుకొస్తున్నాయి. అయితే గతంలో కాజల్ అనే కాకుండా చాలా మంది హీరోయిన్స్ కాసినో ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాప్సీ, త‌మ‌న్నా, హ‌న్సిక‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ వంటి వారి ఫ్రెండ్లి కాసినోని స‌ర‌దాగా ఆడిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వైరల్ అవుతున్న ఈ ఫొటోపై కాజల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.