నటి కాజల్ అగర్వాల్ మొత్తానికి తన మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమైంది. ఈ నటి వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైకి చెందిన ఒక స్టార్ హోటల్లో పెళ్లి చేసుకోనుంది. ఈ వివాహానికి 100 మంది అతిథులు హాజరవుతారట. కుటుంబ సభ్యులతో పాటు అత్యంత స్నేహితుల మాత్రమే వస్తారని సమాచారం. కొనసాగుతున్న మహమ్మారి కారణంగా టాలీవుడ్ సెలబ్రెటీలు పెళ్లికి హాజరుకావడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే వెళ్లనున్నాడు.
ఇక పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో తెలుగు సినీ ప్రముఖుల కోసం విలాసవంతమైన పార్టీని నిర్వహించాలని కాజల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి టాలీవుడ్లోని బిగ్ స్టార్స్ ఆహ్వానించడానికి కాజల్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక పెళ్లి కార్యక్రమాలు అన్ని ముగిసిన తరువాత కాజల్ నవంబర్ చివరి వారం నుండి తిరిగి తన సినిమాలతో బిజీ కానుంది. నెక్స్ట్ కోరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ ఆచార్య సినిమా ద్వారా కాజల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ బ్యూటీ తమిళ్ లో రెండు సినిమాలు బాలీవుడ్ కూడా మరో సినిమా చేస్తోంది.