మొదటిసారి భర్తతో కాజల్ స్పెషల్ మూమెంట్స్.. ఫొటోస్ వైరల్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న ఇంటీరియర్ వ్యవస్థాపకుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. పెళ్లికి కొద్ది రోజుల ముందు కాజల్ తన కాబోయే భర్తతో కలిసి మొదటిసారి ఫోటోను పంచుకుని అభిమానులను ఆకట్టుకుంది. ఆ ఫొటోలో కాజల్ మరియు గౌతమ్ సాంప్రదాయ దుస్తులలో దర్శనమిచ్చారు.

దసరా సందర్భంగా గౌతమ్ బ్లాక్ లాంగ్ కుర్తా మరియు పైజామీలలో కనిపించగా.. కాజల్ నీలం రంగు కుర్తా మరియు షరారాలలో దర్శనమిచ్చింది. ఇద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. కాజల్ మరియు గౌతమ్ ముంబైలో వివాహం చేసుకోనున్నారు. పెళ్లి వేడుకలో కుటుంబం సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారు. కాజల్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వివాహ వేడుకను ప్రైవేట్‌గానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక కాజల్ ప్రస్తుతం సినిమాలను పక్కనపెట్టి పూర్తిగా పెళ్లి పనుల్లో నిమగ్నమైంది.