రూమర్స్ ఎలా మొదలవుతాయో తెలియదు గాని కొన్ని సార్లు అవి వైరల్ అయ్యే విధానం అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తాయి. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయిపోయిందనే రూమర్స్ ఎక్కువవుతున్నాయి. ఒక యువ బిజినెస్ మెన్ తోనే టాలీవుడ్ చందమామ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యిందని కోలీవుడ్ మీడియాలలో కూడా కథనాలు వేలువడుతున్నాయి.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎక్కువగా పెళ్లిళ్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా కేవలం కుటుంబం సభ్యుల సమక్షంలోనే చాలా మంది వివాహం చేసుకుంటున్నారు. ఇక అదే తరహాలో కాజల్ అగర్వాల్ కూడా ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకొని పెళ్లికి సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది. మరొక షాకిచ్చే విషయం ఏమిటంటే.. నిశ్చితార్థ వేడుకకు ఒక యువ హీరో మాత్రమే వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ పై కాజల్ ఎప్పుడు వివరణ ఇస్తుందో చూడాలి.