ఆ ట్వీట్ లో అంత అర్ధం ఉందా కాజు పాపా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ప్రముఖులు విషెస్ చెప్తూ ట్వీట్స్ చేశారు. ట్విట్టర్ అంతా ఎన్టీఆర్ పేరుతో మారు మోగిపోయింది. ఏ స్టార్ హీరో ట్వీట్ చేసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాన్ని రీట్వీట్ చేస్తూ వైరల్ చేశారు. అయితే ఏ ట్వీట్ ని అయినా సంతోషంగా షేర్ చేసిన అభిమానులకి ఒక స్టార్ హీరోయిన్ చేసిన ట్వీట్ పెద్ద పజిల్ గా తయారయ్యింది. దాన్ని డి కోడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏంటా ట్వీట్ అనే కదా మీ డౌట్… ఎవరో కాదు ఎన్టీఆర్ తో బృందావనం, బాద్షా, టెంపర్ లాంటి సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేసిన కాజల్ అగర్వాలే. ఎన్టీఆర్ కి బర్త్ డే విష్ చెప్తూ కాజల్… హ్యాపీయెస్ట్ బర్త్డే తారమి అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అర్థంకాక అభిమానులు తలలు పట్టుకున్నారు, కాజల్ అగర్వాల్ వాడిన పదానికి అర్ధం ఏంటి అంటే… తారక్ నుంచి తారని, సునామీ నుంచి మీ ని తీసుకోని తారమీ అని. అంటే తారక్ ఈజ్ లైక్ సునామీ అని… అవును హి ఈజ్ ఏ సునామీ, tsunami of acting, tsunami of talent, tsunami of stardom, tsunami of collections.