భర్తతో కలిసి కాజల్ కొత్త బిజినెస్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఇటీవలే మాల్ధీవులకు వెళ్లి హనీమూన్‌ను కూడా ఎంజాయ్ చేశారు. మాల్ధీవుల్లో అండర్ వాటర్‌లో ఉన్న ఒక ఖరీదైన హోటల్‌లో ఈ జంట ఒక రోజు గడిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.

KAJAL AGARWAL

హనీమూన్ తర్వాత తిరిగి సినిమా షూటింగ్స్‌లలో కాజల్ పాల్గొంటోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో కాజల్ నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఈ షూటింగ్‌లో చిరు పాటు కాజల్ పాల్గొంది. ఈ షూటింగ్ సమయంలో కాజ‌ల్ – కిచ్లు జంట‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జంటతో దండ‌లు మార్పించి కేక్ కట్ చేయించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఇక సినిమాలతో పాటు భర్తతో కలిసి తాజాగా కాజల్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ‘కిచ్డ్’ పేరిట ఓ హోమ్ డెకార్ బ్రాండ్‌ని ప్రారంభించినట్లు కాజల్ కిచ్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తామిద్దరి ప్రేమ నుంచి ఈ బ్రాండ్ పుట్టిందని, అందరి సపోర్ట్ తమకు ఉంటుందని భావిస్తున్నామన్నారు. మా బ్రాండ్ నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నామన్నారు. మీ ఇంటి అందాన్ని పెంచేందుకు ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయని చెప్పారు.