టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

కైకాల సత్యనారాయణ తెలుగు సినీమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జులై 25న జన్మించాడు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు ఫిల్మ్‌ఫేర్ అవార్డులుజీవితకాల సాఫల్య పురస్కారం (2017)నంది అవార్డులుసవరించుఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం (1994)రఘుపతి వెంకయ్య అవార్డు – 2011సవరించుఇతర గౌరవాలుసవరించుఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు[7]నటశేఖర – అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.నటశేఖర – గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినదికళా ప్రపూర్ణ – కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినదినవరసనటనా సార్వభౌమ – ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.